ఫ్రెండ్‌షిప్‌ డే రోజున విషాదం.. గోదావరిలో ముగ్గురి గల్లంతు - telugu news three killed in sriramsagar project
close
Published : 02/08/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్రెండ్‌షిప్‌ డే రోజున విషాదం.. గోదావరిలో ముగ్గురి గల్లంతు

నందిపేట: స్నేహితుల దినోత్సం రోజున యువకుల విహారయాత్ర విషాదం నింపింది. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన ఆరుగురు యువకులు నందిపేట మండలం నడికూడ శివారులో గోదావరి నది వద్దకు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో వీరు నదిలో స్నానాలు చేయడానికి దిగారు. లోతును అంచనా వేయలేక ముగ్గురు యువకులు రాహుల్‌(20), ఉదయ్‌(19), శివ(19) నీటిలో మునిగిపోయారు. వీరిని గమనించిన మిగతా ముగ్గురు స్నేహితులు నీటమునిగిన వారిని కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని