Saudi Arabia: రెడ్‌లిస్ట్‌ దేశాలకు వెళ్తే మూడేళ్ల ప్రయాణ నిషేధం - telugu news three year travel ban if traveling to red listed countries
close
Updated : 29/07/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Saudi Arabia: రెడ్‌లిస్ట్‌ దేశాలకు వెళ్తే మూడేళ్ల ప్రయాణ నిషేధం

సౌదీ జాబితాలో భారత్‌ కూడా..

దుబాయ్‌: కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉండి ‘రెడ్‌ లిస్ట్‌’లో ఉన్న దేశాలకు వెళ్లిన తమ పౌరులకు మూడేళ్ల పాటు ప్రయాణాలు నిషేధిస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో భారత్‌ కూడా ఉంది. ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రయాణ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధిస్తామని.. అదేవిధంగా మూడేళ్లపాటు వారు విదేశాలు వెళ్లకుండా నిషేధానికి గురవుతారని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక పత్రిక సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ(ఎస్‌పీఏ) వెల్లడించింది. ‘రెడ్‌ లిస్ట్‌’లో యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్‌, యెమెన్‌, ఇరాన్‌, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సోమాలియా, కాంగో, అఫ్గానిస్థాన్‌, వెనెజువెలా, బెలారస్‌, వియత్నాం, భారత్‌ తదితర దేశాలు ఉన్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని