Timmarusu: తారక్‌ పరిచయం చేసిన ‘తిమ్మరుసు’ ట్రైలర్‌ చూశారా! - telugu news timmarusu trailer launch by ntr starring satyadev
close
Updated : 27/07/2021 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Timmarusu: తారక్‌ పరిచయం చేసిన ‘తిమ్మరుసు’ ట్రైలర్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోర్టు నేపథ్యంలో సాగే సినిమాలు ప్రేక్షకులకి ఎప్పుడూ ప్రత్యేకమే. అలా ఈ ఏడాది కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌ తర్వాత ‘వకీల్‌సాబ్‌’గా ప్రేక్షకుల్ని అలరించారు పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడు.. సెకండ్‌ వేవ్‌ తర్వాత సత్యదేవ్‌ లాయరుగా సందడి చేయనున్నారు. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో శరణ్‌ కొప్పిశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘తిమ్మరుసు’. ప్రియాంక జవాల్కర్‌ నాయిక. మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. జులై 30న థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ ట్రైలర్‌ని విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కోర్టు నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ఆద్యంతం అలరిస్తుంది ఈ ట్రైలర్‌.

లాయరుగా సత్యదేవ్‌ ఆకట్టుకుంటున్నారు. ఆయన లుక్‌ చాలా కొత్తగా ఉంది. తనలోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారనిపిస్తుంది. ‘నీ ముందు ఉన్నది వాలి అని మర్చిపోకు.. నీ ఎదురుగా ఉండే సగం బలం లాగుతా లాయర్‌ రామచంద్రా’ అంటూ సత్యదేవ్‌కు వార్నింగ్‌ చేస్తే, ‘నువ్వు సగం బలం లాక్కునే వాలి అయితే, నేను దండేసి దండించే రాముడిలాంటి వాడిని’ అంటూ అంతే దీటుగా సత్యదేవ్‌ పంచ్‌డైలాగ్‌ కొట్టడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ, రవిబాబు,అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: అప్పూ ప్రభాకర్‌.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని