Tokyo Olympics: జ్వెరెవ్‌ కెరీర్‌లో అతిపెద్ద విజయం.. - telugu news tokyo olympics alexander zverev beats karen khachanov in mens singles and won gold
close
Published : 01/08/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: జ్వెరెవ్‌ కెరీర్‌లో అతిపెద్ద విజయం..

టెన్నిస్‌ సింగిల్స్‌లో బంగారు పతకం సాధించిన జర్మన్‌ ఆటగాడు..

టోక్యో: ఒలింపిక్స్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్ విభాగంలో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ సంచలన విజయం సాధించాడు. ఫైనల్స్‌లో రష్యా ఆటగాడు కారన్‌ కచనోవ్‌పై 6-3, 6-1 తేడాతో గెలుపొంది బంగారు పతకం సాధించాడు. దీంతో కెరీర్‌లోనే అతిపెద్ద విజయం కైవసం చేసుకున్నాడు. కాగా, జ్వెరెవ్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ ఒక్క గ్రాండ్‌స్లామ్‌ కూడా లేకపోయిన సంగతి తెలిసిందే. గతేడాది యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి డొమినిక్‌ థీమ్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. అదే జ్వెరెవ్‌కు ఇప్పటివరకున్న అత్యుత్తమ ప్రదర్శన. ఆదివారం ఒలింపిక్స్‌ ఫైనల్స్‌లో విజయం సాధించడంతో తొలిసారి స్వర్ణం సాధించాడు. ఇదే విజయంతో జర్మనీ తరఫున టెన్నిస్‌లో సింగిల్స్‌ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగానూ జ్వెరెవ్‌ రికార్డు నెలకొల్పాడు. ఒక గంట 19 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జర్మన్‌ ఆటగాడు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కచనోవ్‌కు ఏ అవకాశం ఇవ్వకుండా తన కలను సాకారం చేసుకున్నాడు. మరోవైపు సెమీస్‌లో అతడు దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఇక జకోవిచ్‌ శనివారం కాంస్యం కోసం తలపడిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలై తీవ్ర నిరాశకు గురయ్యాడు. స్పెయిన్‌కు చెందిన పాబ్లో బుస్టా చేతిలో 4-6, 7-6 (6), 3-6 తేడాతో ఓడిపోయాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని