Tokyo Olympics: 100 దాటిన కరోనా కేసులు.. భయం భయంగా అథ్లెట్లు - telugu news tokyo olympics linked covid count goes past 100 on day of opening ceremony with 19 new cases
close
Published : 23/07/2021 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: 100 దాటిన కరోనా కేసులు.. భయం భయంగా అథ్లెట్లు

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన కొవిడ్‌-19 కేసులు శుక్రవారం వంద దాటాయి. తాజాగా 19 మందికి వైరస్‌ సోకినట్టు తెలిసింది. చెక్‌ రిపబ్లిక్‌ బృందంలోనే ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. రోడ్‌ సైకిలిస్టు మైకేల్‌ షెలిజెల్‌ ఆ బృందంలో పాజిటివ్‌గా తేలిన నాలుగో ఆటగాడు కావడం గమనార్హం.

శుక్రవారమే ఒలింపిక్స్‌ క్రీడలు ఆరంభమయ్యాయి. అంగరంగ వైభంగా జరగాల్సిన క్రీడలు మహమ్మారి వల్లే సాదాసీదాగా సాగుతున్నాయి. ఆరంభోత్సవానికి వెయ్యిమంది లోపే ప్రముఖులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ముగ్గురు అథ్లెట్లు, పది మంది క్రీడా సిబ్బంది, ముగ్గురు మీడియా వ్యక్తులు, ముగ్గురు కాంట్రాక్టర్లకు వైరస్‌ సోకిందని నిర్వాహకులు తెలిపారు.

ఇప్పటి వరకు 106 మందికి వైరస్‌ సోకింది. అందులో 11 మంది అథ్లెట్లు. తాజాగా మైకేల్‌కు కరోనా రావడంతో అతడిని ఐసోలేషన్‌కు పంపించారు. జమైకా లాంగ్‌ జంపర్‌ కేరీ మెక్‌లియాడ్‌కు సొంత దేశంలోనే పాజిటివ్‌ రావడంతో ఆటలకు దూరమయ్యాడని సమాచారం. ఇక చెక్‌ బృందానికి చెందిన వైద్యుడికి సైతం పాజిటివ్‌ రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ గ్రామంలో ఇంకా ఎంతమందికి వైరస్‌ సోకుతుందోనని ఆందోళన కలుగుతోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని