Tollywood Updates: డబ్బింగ్‌, షూటింగ్‌లతో యువ హీరోల సందడి - telugu news tollywood movies latest updates ghani varun tej
close
Published : 09/08/2021 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood Updates: డబ్బింగ్‌, షూటింగ్‌లతో యువ హీరోల సందడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ ముగిసింది.. సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి. తమ చిత్రాల్ని త్వరితగతిన ప్రేక్షకుల్ని ముందుకు తీసుకొచ్చేందుకు ఆయా చిత్ర బందాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొందరు తారలు సెట్స్‌లోకి అడుగుపెట్టారు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. తాజాగా వరుణ్‌ తేజ్‌, శ్రీ విష్ణు, నాగ చైతన్య ఆ జాబితాలో నిలిచారు. మరి వీళ్లు ఏ సినిమాతో బిజీగా ఉన్నారో చూద్దామా..

‘గని’‌.. మాటలు

బాక్సింగ్‌ నేపథ్యంలో వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. గురువారం ఈ చిత్ర డబ్బింగ్‌ పనులు ప్రారంభమైనట్టు సామాజిక మాధ్యమాల వేదికగా చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ ఫొటోను విడుదల చేసింది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాల్ని శరవేగంగా జరుపుకుని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుణ్‌ సరసన బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

‘భళా తందనాన’.. మళ్లీ మొదలైంది

శ్రీ విష్ణు హీరోగా చైతన్య దంతులూరి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘భళా తందనాన’. కేథరిన్‌ నాయిక. వారాహి చలన చిత్రం సంస్థ నిర్మిస్తోంది. సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ అనంతరం సోమవారం ఈ సినిమా షూటింగ్‌ పునః ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫొటోని పంచుకున్నాడు శ్రీ విష్ణు. కొవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ చిత్రీకరణ జరుపుతున్నారు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఆర్మీ అధికారిగా చైతూ..

ఆమీర్‌ ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న బాలీవుడ్‌ చిత్రం ‘లాల్‌  సింగ్‌ చద్దా’. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. ఈ చిత్రంలో నాగ చైతన్య ఆర్మీ అధికారిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఆర్మీ దుస్తుల్లో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నారు చైతన్య. తెలుగులో ఆయన నటించిన ‘లవ్‌ స్టోరీ’ త్వరలోనే విడుదల కానుంది.  

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని