Minnal Murali: సూపర్‌మ్యాన్‌, బ్యాట్‌మెన్‌, స్పైడర్‌ మ్యాన్‌ వీళ్లంతా ఎవరు? - telugu news tovino thomas minnal murali official trailer
close
Updated : 30/10/2021 18:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Minnal Murali: సూపర్‌మ్యాన్‌, బ్యాట్‌మెన్‌, స్పైడర్‌ మ్యాన్‌ వీళ్లంతా ఎవరు?

ఇంటర్నెట్‌డెస్క్‌‌: సూపర్‌మ్యాన్‌, బ్యాట్‌మెన్‌, స్పైడర్‌ మ్యాన్‌ ఇలా సూపర్‌హీరోస్‌ అందరూ హాలీవుడ్‌లోనూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాలకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. ఇక భారత్‌లో సూపర్‌ హీరో పాత్రలు చాలా తక్కువ. మాస్‌ కమర్షియల్‌ సినిమాలకే ఇక్కడ ప్రేక్షకులు పట్టం కడతారు. అయితే, వైవిధ్య కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ. త్వరలో మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టోవినో థామస్‌(Tovino Thomas) కథానాయకుడిగా బసిల్‌ జోసెఫ్ తెరకెక్కిస్తున్న సూపర్‌హీరో అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘మిన్నల్‌ మురళి’(Minnal Murali). మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీల్లో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం అలరించేలా, నవ్వులు పూయిస్తూ ట్రైలర్‌ ఆకట్టుకుంది. అనుకోని పరిస్థితుల్లో మెరుపుల కారణంగా జైసన్‌ అనే టైలర్‌ అతీంద్రియ శక్తులు పొందుతాడు. వాటితో తన ఊరికోసం ఏం చేశాడు? వాటిని ఎలా ఉపయోగించాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డిసెంబరు 24న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ‘మిన్నల్‌ మురళి’ స్ట్రీమింగ్‌కానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని