Huzurabad: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ - telugu-news-trs and bjp leaders fight each other in huzurabad
close
Updated : 29/07/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Huzurabad: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ

హుజూరాబాద్‌: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హుజూరాబాద్‌ అంబేద్కర్‌ కూడలిలో తెరాస, భాజపా వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీలను కించపరిచేలా ఈటల జమున సోదరుడు మధుసూదన్‌ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండగా.. అదే విషయంపై రెండు పార్టీల శ్రేణులు గొడవకు దిగాయి. దాన్ని తెరాస వర్గాయులే సృష్టించారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు.

ఈ క్రమంలో హుజూరాబాద్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఈటల జమున పాలాభిషేకం చేశారు. అదే సమయంలో తెరాస వర్గీయులు అక్కడకు రావడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎం కేసీఆర్‌ ప్లెక్సీలు తగులబెట్టేందుకు భాజపా శ్రేణులు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భాజపా కార్యకర్తలను అడ్డుకొని నిలువరించారు. తెరాస వర్గీయులను అక్కడ నుంచి పంపించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని