AP News: తిరుపతిలో కూలిన తితిదే ఆర్చి.. తప్పిన పెను ప్రమాదం - telugu news ttd arch collapsed in tirupati
close
Updated : 19/09/2021 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: తిరుపతిలో కూలిన తితిదే ఆర్చి.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతి: తిరుపతిలోని రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఏర్పాటు చేసిన స్వాగత తోరణం(ఆర్చి) కూలింది. నగరంలోని రిలయన్స్‌ మార్ట్‌ వద్ద ఉండే ఆర్చి కూలడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో పాటు ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. లారీ తగలడంతో ఆర్చి కూలినట్లు తెలుస్తోంది. గరుడ వారధి నిర్మాణ పనుల సమయంలో ఈ తోరణం పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న అధికారులు ఆర్చిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని