Tuck Jagadish: ఆ ఒక్క సీన్‌ చాలు.. నానిని ‘నేచురల్‌ స్టార్‌’ అని పిలవడానికి..! - telugu news tuck jagadish nani and ritu react to fan comments
close
Published : 08/09/2021 23:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tuck Jagadish: ఆ ఒక్క సీన్‌ చాలు.. నానిని ‘నేచురల్‌ స్టార్‌’ అని పిలవడానికి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: నాని కథానాయకుడిగా శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, యాక్షన్‌ డ్రామా ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర రాజేశ్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబైంది. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా నాని, రీతూ వర్మ అభిమానుల కామెంట్స్‌కు సమాధానాలు ఇచ్చారు.

‘టక్‌ జగదీష్‌’ ట్రైలర్‌ చూసిన ఓ అభిమాని ‘చివరి సన్నివేశంలో నాని ఎక్స్‌ప్రెషన్‌ ఒక్కటిచాలు. అందుకే ఆయన్ను నేచురల్‌ స్టార్‌ అని పిలుస్తారు’ అని కామెంట్ చేయగా, ఆ క్రెడిట్‌ దర్శకుడు శివ నిర్వాణకు దక్కుతుందని, అందరూ ఆ సీన్‌ను మెచ్చుకుంటున్నారని నాని సమాధానం ఇచ్చారు. ‘ఎమోషనల్‌ సన్నివేశాలు చేయడంలో ప్రస్తుత జనరేషన్‌ ఉన్న నటులతో పోలిస్తే నాని 1000 మైళ్ల ముందున్నాడు. ఒక్కడంటే ఒక్కడు కూడా ఆయన నటనపై కామెంట్‌ చేయడానికి పనికిరాడు’ అని మరో అభిమాని పేర్కొనగా, నాని నటన చూసి తాను కూడా ఫిదా అయినట్లు రీతూవర్మ అన్నారు. ఇలా అభిమానుల స్పందనలకు నాని, రీతూ వర్మ ఏ విధంగా సమాధానం ఇచ్చారో మీరే చూసేయండి!




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని