నీలకంఠ దర్శకత్వంలో ప్రథమ భూదాత రామచంద్రారెడ్డి బయోపిక్‌ - telugu news v ramachandra reddy biopic under direction of neelakanta
close
Published : 30/07/2021 18:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీలకంఠ దర్శకత్వంలో ప్రథమ భూదాత రామచంద్రారెడ్డి బయోపిక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రథమ భూదాతగా పేరొందిన దివంగత వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్‌ రాబోతుంది. నీలకంఠ దర్శకత్వంలో రామచంద్రారెడ్డి జీవితం తెరపైకి వస్తుంది. రామచంద్రా రెడ్డి మనవడు అరవింద్‌ రెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. నటుడు అల్లు అర్జున్‌ మావయ్య కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించనున్నారు. ‘గాంధీజీ శిష్యుడైన వినోభాబావే అడగ్గానే 100 ఎకరాల భూమిని దానం చేశారు రామచంద్రారెడ్డి. తర్వాత భూదాన కార్యక్రమం ఓ యజ్ఞంగా మారింది. అంతటి గొప్ప చరిత్ర కలిగిన రామచంద్రారెడ్డి, పోచంపల్లి భూదాన్‌ గురించి నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే నటీనటుల్ని ఎంపిక చేసి, చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అని చిత్ర బృందం తెలిపింది. దర్శకుడు నీలకంఠ గతంలో ‘షో’, ‘మిస్సమ్మ’, ‘సదా మీ సేవలో’, ‘విరోధి’, ‘చమ్మక్‌ చల్లో’ తదితర చిత్రాలు తెరకెక్కించి మంచి గుర్తింపు పొందారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని