Varudu Kavalenu: నాగశౌర్య, రీతూవర్మ పెళ్లి సందడి.. ట్రైలర్‌ విడుదల చేసిన రానా - telugu news varudu kavalenu trailer launch by rana daggubati starring nagashaurya rithu varma
close
Updated : 21/10/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varudu Kavalenu: నాగశౌర్య, రీతూవర్మ పెళ్లి సందడి.. ట్రైలర్‌ విడుదల చేసిన రానా

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు రానా ట్రైలర్‌ని విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘పెళ్లి చూపుల కాన్సెప్టే మా అమ్మాయికి పడదు’ అని కథానాయిక (రీతూ) తల్లి చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ సందడిగా సాగింది. పెళ్లి చూపులు కాన్సెప్ట్‌ అంటేనే ఇష్టంలేని ఆ అమ్మాయిని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నం చేస్తుంటాడు శౌర్య. ఈ క్రమంలో అదంత తేలికైన విషయం కాదని తెలుసుకుంటాడు. కట్‌ చేస్తే, ఒకానొక సందర్భంలో ఇరువురి మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. ‘భూమి, ఆకాశం.. ఎదురెదురుగా ఉన్నా ఎప్పటికీ కలవలేవు’ అంటూ శౌర్యని దూరంపెడుతుంది రీతూ. మరి ఈ ఇద్దరి మధ్యా విభేదాలకు కారణమేంటి? వివాహం చేసుకుంటారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని