Venkaiah Naidu: యువత కష్టపడి పనిచేసే తత్వం అలవర్చుకోవాలి: ఉపరాష్ట్రపతి - telugu-news-vice president venkaiah naidu visits gmr foundation
close
Published : 01/08/2021 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Venkaiah Naidu: యువత కష్టపడి పనిచేసే తత్వం అలవర్చుకోవాలి: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌: భారతీయ యువతలో సహజంగానే అపారమైన ప్రతిభాపాటవాలు ఉన్నాయని.. నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆ సామర్థ్యానికి పదునుపెట్టి సద్వినియోగ పర్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని జీఎంఆర్-వరలక్ష్మీ ఫౌండేషన్, జీఎంఆర్-చిన్మయ విద్యాలయాలను ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అందుబాటులో ఉన్న వనరులు యువత సద్వినియోగం చేసుకోవడంతోపాటు కష్టపడి పనిచేసే తత్వం అలవర్చుకోవాలన్నారు. ఇప్పుడు శ్రమించి సొంత కాళ్లపై నిలబడితేనే భవిష్యత్తు సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

విద్యతోపాటు శారీరక శ్రమ కూడా చిన్నతనం నుంచే అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. జీఎంఆర్ సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ.. దానిని తోటి సమాజంతో పంచుకోవాలనే ఆలోచన జీఎంఆర్‌ సంస్థకు రావడం గొప్ప విషయమన్నారు. చక్కటి ఉదారవాదంతో సేవా కార్యక్రమాలు, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న జీఎంఆర్ సంస్థను వెంకయ్యనాయుడు అభినందించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని