Venkaiah Naidu: బయోటెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌: వెంకయ్యనాయుడు - telugu news vice president venkayyanaidu visits bharat biotech
close
Published : 31/07/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Venkaiah Naidu: బయోటెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్‌: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం హైదరాబాద్‌ జినోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాస్త్రవేత్తలనుద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. జినోమ్‌ వ్యాలీలో అనేక సంస్థలు కొలువుదీరాయని, హైదరాబాద్‌ బయో టెక్నాలజీ హబ్‌గా మారుతోందన్నారు. భారత్‌ బయోటెక్‌ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ‘‘భారత్‌ బయోటెక్‌ 16 రకాల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి వరకు నాలుగు బిలియన్ల టీకాలు పంపిణీ చేసింది. మన శాస్త్రవేత్తలు అనేక దేశాల ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. గత అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. మరింత త్వరగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయాలి. ఆహార, వ్యవసాయ రంగాలపైనా దృష్టి సారించాలి. అన్ని విషయాల్లో పశ్చిమదేశాలు గొప్పవనే దృక్పథం మారాలి’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్‌ అలీ, భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని