Vijay Deverakonda: ఆ క్షణం అమ్మానాన్న ఏడ్చారు.. దేవరకొండ బ్రదర్స్ జీవితమిది! - telugu news vijay deverakonda anand deverakonda interview
close
Updated : 26/10/2021 18:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijay Deverakonda: ఆ క్షణం అమ్మానాన్న ఏడ్చారు.. దేవరకొండ బ్రదర్స్ జీవితమిది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సహాయ నటుడిగా వెండి తెరకు పరిచమై, పాన్‌ ఇండియా స్థాయి హీరోగా ఎదిగాడు విజయ్‌ దేవరకొండ. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తన మార్క్‌ చూపిస్తున్నాడు. తన సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా, విజయ్‌ నిర్మించిన ‘పుష్పక విమానం’ నవంబరు 12న విడుదల కానుంది. దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రచారంలో భాగంగా దేవరకొండ బ్రదర్స్‌ ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ జీవితాల్లో జరిగిన ఆసక్తికర సంఘటనలను అన్నదమ్ములిద్దరూ పంచుకున్నారు.

* మీ తల్లిదండ్రులు ఎవరిని ఎక్కువగా గారాబం చేశారు?

విజయ్‌: ఆనంద్‌నే బాగా గారాబం చేశారు. క్రికెట్‌లో తను ఔట్‌ అయినా ‘నాటౌట్‌’ అనేవారు మా నాన్న. ఈ కోపంలో ఓసారి ఆనంద్‌పై బంతి విసిరాను. అమ్మానాన్నలతో తిట్లు తిన్నాను (నవ్వులు).

* ఇద్దరిలో అమ్మకి ఎవరంటే ఇష్టం?

విజయ్‌: అమ్మ ఫేవరెట్‌ నేను. డాడీ ఫేవరెట్‌ ఆనంద్‌.

ఆనంద్‌: విజయ్‌ తన సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ సంగతులన్నీ అమ్మతో పంచుకుంటాడు. ‘ఈ రోజు షూట్‌ ఇలా జరిగింది, అలా జరిగింది. ఆనంద్‌ ఏం చేస్తున్నాడు’ అంటూ ఆప్యాయంగా మాట్లాడతాడు. నాకు ఆ అలవాటు లేదు. నా షూటింగ్‌ పూర్తవగానే నా ప్రపంచంలో నేనుంటా. అందుకే అమ్మకి విజయ్‌ అంటే ఇష్టం.

* చిన్నప్పుడు మీ ఇద్దరూ గొడవపడ్డారా?

విజయ్‌: హా.. చాలా సార్లు. ఇంతకు ముందు చెప్పినట్టు క్రికెట్‌ ఆడేటప్పుడు ఎక్కువగా గొడపడేవాళ్లం. ఆనంద్‌ తను ఆడుకునే బొమ్మ విరగొట్టుకుని నా బొమ్మల్ని తీసుకునేవాడు. హాస్టల్‌లో ఉన్నప్పుడు నాతో ఎంతో సరదాగా ఉండేవాడు. సెలవులకు ఇంటికొచ్చినప్పుడు చుక్కలు చూపించేవాడు.

* ఆటల్లో ఎవరు ఎక్కువగా ఉత్సాహం చూపించేవారు?

విజయ్‌: మా ఇద్దరికీ ఆటలంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్‌ని వారాంతంలో అసలు మిస్‌ అయ్యేవాళ్లం కాదు. వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ నాకంటే ఆనందే బాగా ఆడతాడు. తనకి ఓపిక ఎక్కువ. నాకు బద్ధకం.

* ఎవరు ముందుగా డబ్బు సంపాదించారు?

ఆనంద్‌: ఓ ఇంటర్న్‌షిప్‌ ద్వారా నేనే ముందుగా మనీ సంపాదించా.

విజయ్‌: మా అమ్మ నడిపే ఓ ఇన్‌స్టిట్యూట్‌లో అప్పుడప్పుడు చిన్న మొత్తంలో డబ్బు సంపాదించేవాడ్ని. కానీ, ఉద్యోగం ద్వారా అంటే ఆనంద్‌దే తొలి సంపాదన. తనకి యూఎస్‌లో ఉద్యోగం వచ్చిందనే విషయం తెలియగానే అమ్మానాన్న భావోద్వేగానికి గురై ఏడ్చేశారు. తనకి జాబ్‌ వచ్చాకే మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఆనంద్‌ యూఎస్‌ నుంచి వచ్చాక నాకూ నా స్నేహితుడికి పార్టీ ఇచ్చాడు. ఆ క్షణాల్ని మరిచిపోలేను.

* ఎవరు ఎక్కువగా ఖర్చు చేస్తారు?

ఆనంద్‌: విజయ్‌ ఎక్కువగా ఖర్చుపెడతాడు. ఇందులో సందేహమే లేదు.

విజయ్‌: నా చేతికి డబ్బు రాగానే సినిమాల్ని నిర్మిస్తుంటా. ‘ఏవీడీ’ థియేటర్‌ నిర్మించా. నాకు నచ్చిన దుస్తుల్ని ఆఫర్‌లో కొనుకుంటుంటా. ఒకప్పుడు నా బట్టలు ఆనంద్‌ వేసుకునేవాడు. (నవ్వుతూ..).

* మీ గురించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయం?

విజయ్‌: చాలా ఉన్నాయి. కానీ, చెప్పను.

* చివరగా ‘పుష్పక విమానం’ గురించి ఏదైనా చెప్పండి..

విజయ్‌: ‘పుష్పక విమానం’ ట్రైలర్‌ అక్టోబరు 30న విడుదలవుతుంది. చూసి ఆనందించండి. నేను చూశా. నాకు బాగా నచ్చింది.

ఆనంద్‌: ‘పుష్పక విమానం’.. పూర్తిస్థాయి వినోదభరిత చిత్రం. ట్రైలర్‌ చూడగానే మీకు ఆ విషయం అర్థమవుతుంది.

విజయ్‌- ఆనంద్‌ పంచుకున్న మరికొన్ని విశేషాలు ఈ వీడియోలో చూడండి...


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని