Vijaya Raghavan: ట్యూషన్‌ మాస్టర్‌ ఐఏఎస్‌ అయితే.. - telugu news vijaya raghavan trailer released vijay antony
close
Published : 02/08/2021 22:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijaya Raghavan: ట్యూషన్‌ మాస్టర్‌ ఐఏఎస్‌ అయితే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్యూషన్‌ మాస్టర్‌ ఐఏఎస్‌ అయితే ఎలా ఉంటుందో చూపించేందుకు సిద్ధమైంది ‘విజయ రాఘవన్‌’ చిత్ర బృందం. విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా ఆనంద కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించేందుకు మరికొన్ని రోజుల్లో రాబోతుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ని విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ‘బ్లేడు శ్రీను, గజ్జల బాబ్జీ, అలీ భాయ్‌, గుండు రాజు.. వాళ్లురా నేరస్థులు. వాళ్లని అరెస్ట్‌ చేయండి. వాళ్లని చేయకుండా బడికి వెళ్లే పిల్లల్ని అరెస్ట్‌ చేస్తారేంట్రా’ అని మిషన్‌ కుట్టే వ్యక్తి చెప్పే భారీ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది. ‘మా ఏరియా ట్యూషన్‌ మాస్టర్‌.. ఐఏఎస్‌ చదువుతున్నాడు’ అని కథానాయకుడి పాత్రని చూపించిన తీరు మెప్పిస్తుంది. రాజకీయ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ‘ఒకే ఒక సంవత్సరంలో మన కాలనీని చిన్న సింగపూర్‌లా మార్చేస్తాను’ అని ఓ రాజకీయ నాయకుడు వాగ్దానం చేయగా ‘చిన్న సింగపూర్‌లా మారుస్తాను.. చిన్న జపాన్‌లా మారుస్తానని అందరూ మా బస్తీని చిన్న శ్మశానంలా మార్చేశారు. అందరూ మోసగాళ్లే’ అంటూ ఓ మహిళ ఇచ్చిన సమాధానం అలరిస్తుంది. మరి విజయ్‌ రాఘవన్‌ అనుకున్న లక్ష్యం చేరుకున్నాడా? అనూహ్యంగా రాజకీయ నాయకుడిగా మారాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో విజయ్‌ సరసన ఆత్మిక నటిస్తోంది. రామచంద్రరాజు, ప్రభాకర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టి.డి. రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నివాస్‌ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని