HYD: విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - telugu news vijayasaireddy bail petition hearing adjourned
close
Updated : 10/08/2021 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYD: విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

 

హైదరాబాద్‌: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఈ నెల 7న సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి నోటీసు కూడా జారీ చేసింది. కాగా, ఇవాళ జరిగిన విచారణలో కౌంటర్‌ దాఖలుకు మరింత గడువు కావాలని సీబీఐ కోరింది. వాదనలు విన్న సీబీఐ ధర్మాసనం విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించినందుకు బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ కోర్టును కోరిన విషయం తెలిసిందే. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని