నియంత పాలన నుంచి విముక్తి చేయాలని కోరుకున్నా: విజయశాంతి - telugu news vijayasanthi participated lal darwaza bonalu
close
Published : 01/08/2021 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నియంత పాలన నుంచి విముక్తి చేయాలని కోరుకున్నా: విజయశాంతి

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల్ని కాపాడాలని సింహవాహినీ మహంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు భాజపా నేత విజయశాంతి తెలిపారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా పాతబస్తీలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకొస్తే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నట్లు విజయశాంతి చెప్పారు. అమ్మవారు చాలా శక్తిమంతమైనదని.. ఎక్కడ చూసినా పండుగ వాతావరణ కనిపిస్తోందన్నారు. నిజమైన భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అందరూ కలిసి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. నియంత పాలనలో తెలంగాణ తల్లి నలిగిపోతోందని.. దీని నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి చేయాలని అమ్మవారిని కోరినట్లు చెప్పారు.    మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని