గబ్బర్‌ సేన విజయానికి కోహ్లీసేన మురిపెం! - telugu news virat kohli ravi shastri and others cheer from durham as india win thriller in colombo
close
Published : 21/07/2021 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గబ్బర్‌ సేన విజయానికి కోహ్లీసేన మురిపెం!

కుర్రాళ్ల ఆటకు సీనియర్లు ఫిదా

ముంబయి: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. దీపక్‌ చాహర్‌ (69*; 82 బంతుల్లో 7×4, 1×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (53; 44 బంతుల్లో 6×4) విజృంభించిన వేళ.. టీమ్‌ఇండియా 276 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు ఉండగానే ఛేదించింది. కాగా లంకలో గబ్బర్‌సేన విజయానికి ఇంగ్లాండ్‌లోని కోహ్లీసేన కేరింతలు కొట్టడం విశేషం.

ఒకేసారి రెండు వేర్వేరు దేశాల్లో టీమ్‌ఇండియా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్లతో కూడిన కోహ్లీసేన ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు సిద్ధమవుతోంది. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన గబ్బర్‌ సేన లంకలో రెండు సిరీసులు ఆడుతోంది. కాగా మొదటి వన్డేను సునాయసంగా గెలిచిన భారత్‌, రెండో వన్డేలో కాస్త చెమటోడ్చింది. ఛేదనలో 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో కృనాల్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌తో పేసర్‌ దీపక్‌ చాహర్‌ అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆఖర్లో లంక స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఫలితం ఏమవుతుందో అన్న ఆసక్తి కలిగింది. హసరంగ లెగ్‌స్పిన్‌ను ఎదుర్కొంటూనే, మిగతా వాళ్ల బౌలింగ్‌లో బౌండరీలు బాదడంతో గబ్బర్‌సేన విజయం అందుకుంది. ఈ విజయాన్ని భారత అభిమానులే కాకుండా ఇంగ్లాండ్‌లోని కోహ్లీసేన సైతం ఆస్వాదించింది. ఆఖరి వరకు వారు మ్యాచును వీక్షించారు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకొంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని