HYD: హైదరాబాద్‌లో రానున్న 4-5 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు! - telugu news weather forecast in telangana
close
Updated : 27/09/2021 10:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYD: హైదరాబాద్‌లో రానున్న 4-5 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు!

హైదరాబాద్‌: గులాబ్‌ తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో రానున్న 4-5 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. ఖమ్మం, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది.

ఈ తుపాను ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, ఉప్పల్‌, రామంతాపూర్‌, పీర్జాదిగూడ, మేడిపల్లి, బోడుప్పల్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరోవైపు వర్షాల కారణంగా జేఎన్టీయూహెచ్‌ పరిధిలో నేడు జరగాల్సిన బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇద్దరు అధికారులతో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సాయం కోసం కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 040 23202813ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని