Rajkundra: అది వెబ్‌సిరీస్‌ మాత్రమే పోర్న్‌ కాదు   - telugu news web series content no porn
close
Published : 22/07/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajkundra: అది వెబ్‌సిరీస్‌ మాత్రమే పోర్న్‌ కాదు 

కోర్టులో రాజ్‌కుంద్రా తరఫు న్యాయవాది

ముంబయి: అశ్లీల చిత్రాలు నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణలతో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రా కేసు విచారణలో భాగంగా ఆయన తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్టుకి కారణమైన వీడియో షూట్‌ ఏదైతే ఉందో అది కేవలం వెబ్‌సిరీస్‌ చిత్రీకరణేనని అన్నారు. అది పోర్న్‌ కానే కాదని ఆయన తెలిపారు.

‘ఈ మధ్యకాలంలో వస్తున్న వెబ్‌సిరీస్‌లను చూస్తే వాటిల్లో ఎక్కువగా అభ్యంతరకర సన్నివేశాలు మాత్రమే ఉంటున్నాయి. అదే మాదిరిగా ఇది కూడా ఓ వెబ్‌సిరీస్‌ మాత్రమే తప్ప పోర్న్‌ ఫిల్మ్‌ కాదు. మనకున్న సెక్షన్ల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు కెమెరా ముందు శృంగారం చేస్తున్నట్లు కనిపిస్తేనే దాన్ని పోర్న్‌ కింద వర్గీకరించాలి. అలా కాకుండా ఏ ఇతర అశ్లీల సన్నివేశాలను పోర్న్‌ కింద పరిగణించాల్సిన అవసరం లేదు’ అని రాజ్‌కుంద్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబయి శివారులోని ‘మాద్‌ దీవి’లోని ఓ బంగ్లాలో పోర్న్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి ‘పోర్న్ రాకెట్‌’ గుట్టుని బయటపెట్టారు. ఇందులో భాగంగానే ‘హాట్‌షాట్స్‌’ యాప్‌ నిర్వహిస్తున్న రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని