Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు - telugu top ten news at nine pm
close
Published : 23/07/2021 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు

1. పిల్లల్లో 55%.. పెద్దల్లో 61% కొవిడ్‌ యాంటీబాడీలు

తెలంగాణలో నాలుగో విడత సీరో సర్వే ఫలితాలను జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ప్రకటించింది. రాష్ట్రంలోని జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఐసీఎంఆర్‌ సీరో సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. సీరో సర్వేలో 60 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు గుర్తించినట్లు తెలిపింది. వారిలో 55 శాతం పిల్లలు, 61 శాతం మంది పెద్దవారిలో యాంటీబాడీలు గుర్తించామని పేర్కొంది. అలాగే 82.4 శాతం మంది హెల్త్‌కేర్‌ వర్కర్లలో యాంటీబాడీలు గుర్తించామని తెలిపింది.

2. విశాఖ ఉక్కు విక్రయం ఆపండి: విజయసాయిరెడ్డి

విశాఖ ఉక్కుపై కార్మిక సంఘాల నేతలతో కలిసి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విక్రయం ఆపాలని, పరిశ్రమపై నిర్ణయం ఉపసంహరించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘‘విశాఖ ఉక్కు’ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది. నవరత్న హోదా  సాధించిన విశాఖ ఉక్కు ఏపీకి ఆభరణం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై లక్షకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 

విశాఖ ఉక్కు కోసం రాజీనామాలకు సిద్ధం: చంద్రబాబు

3. అలరిస్తున్న కేటీఆర్‌ బర్త్‌డే సాంగ్‌ 

ఈ నెల 24న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ​పుట్టిన రోజు సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పాటను రూపొందించారు. కేటీఆర్‌పై రూపొందించిన పాటను తెలంగాణ భవన్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ పాటకు పూర్ణచందర్‌ దర్శకత్వం వహించగా.. రచయిత మానుకోట ప్రసాద్‌ బాణీలు అందించారు. 

4. హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై ఘోర ప్రమాదం: ఏడుగురి మృతి

హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. నాగర్‌ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్‌ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వెళ్లే కారులో ఉన్న ముగ్గురు, హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వైపు వెళ్లే కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడినట్టు  డీఎస్పీ నర్సింహులు తెలిపారు. రోడ్డు ప్రమాదం ధాటికి రెండు కార్లు నుజ్జునజ్జయ్యాయి.

5. 12 సెంట్రల్‌ యూనివర్సిటీలకు కొత్త వీసీలు

దేశంలోని 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కొత్త వీసీల జాబితాను విడుదల చేసింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీగా డాక్టర్‌ బీజే రావు నియమితులు కాగా.. మౌలానా అజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్‌ సయ్యద్‌ అన్యుల్‌ హసన్‌కు అవకాశం లభించింది.

6. కరోనా, వ్యాక్సిన్‌లపై రాజకీయాలు చేయొద్దు..!

దేశంలో కరోనా వైరస్‌, వ్యాక్సిన్‌ సమస్యలపై ఎటువంటి రాజకీయం చేయొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించే బృహత్తర కార్యక్రమంలో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇక అమెరికాకు చెందిన ఫైజర్‌ వ్యాక్సిన్‌తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉందని.. లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

7. ‘జై భీమ్‌’ అంటున్న సూర్య

తమిళ నటుడు సూర్య వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. జులై 23(శుక్రవారం) సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రాల విశేషాలను ఆయా చిత్రబృందాలు ప్రకటించాయి. సూర్య హీరోగా నటిస్తోన్న 39వ చిత్రం పేరు ‘ జై భీమ్‌’గా ఖరారైంది. ఈ సందర్భంగా సూర్య ‘జై భీమ్‌’ ఫస్ట్‌లుక్‌ని ట్విటర్‌ వేదికగా పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

8. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌పై విచారణ జరపాల్సిందేనన్న హైకోర్టు!

తాము అవలంబిస్తున్న అంతర్గత వ్యాపార విధానాలపై విచారణను నిలిపివేయాలంటూ అమెరికాకు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ చేసిన అభ్యర్థనలను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్లకు విచారణయోగ్యత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

9. ఘనంగా టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుక!

ఒలింపిక్స్‌ క్రీడా మహోత్సవం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో కొద్ది మంది అతిథులు, ప్రేక్షకుల మధ్య వేడుకను నిర్వహించారు. భారీ సంఖ్యలో క్రీడాభిమానులు లేకున్నా.. బాణాసంచా పేల్చి.. నృత్యప్రదర్శనలు, లైట్‌షో నిర్వహించి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నడిపించారు. వేడుకలో భాగంగా పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు వారి జాతీయ పతాకంతో మార్చ్‌లో పాల్గొన్నారు.

10. లంక ముందు మోస్తరు లక్ష్యం
లంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లంక స్పిన్నర్లు అఖిల ధనంజయ 3/44, జయవిక్రమ 3/59 చెలరేగడంతో భారత్‌ 43.1 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని మ్యాచ్‌ అధికారులు 47 ఓవర్లలో 227గా నిర్ణయించారు.

IND vs SL: లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని