పాకిస్థాన్‌ నుంచి తెలుగు యువకుడి విడుదల - telugu youngsters released from pakistan
close
Updated : 01/06/2021 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాకిస్థాన్‌ నుంచి తెలుగు యువకుడి విడుదల

హైదరాబాద్‌: పాకిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్‌ విడుదలయ్యాడు. యువకుడిని పాక్‌ అధికారులు వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించారు. దీంతో ప్రశాంత్‌ ఈరోజు లేదా రేపు ఉదయం హైదరాబాద్‌ చేరుకోనున్నాడు. నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్న ప్రశాంత్‌.. 2017లో తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో పాక్‌ అధికారులకు చిక్కాడు. ఎలాంటి వీసా, పాస్‌పోర్ట్‌ లేకుండా పాక్‌ భూభాగంలో అడుగుపెట్టడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్‌ పాక్‌ అధికారులకు చిక్కడంతో అతడి తండ్రి బాబూరావు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిశారు. తన కుమారుడిని విడిపించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ సహకారంతో ప్రశాంత్‌ను తిరిగి స్వదేశానికి రప్పించారు. ప్రశాంత్‌ విడుదలతో అతడి కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని