F3: ఎఫ్‌-3 రిలీజ్‌ డేట్‌ చెప్పేశారుగా..! - telugun news f3 release date announced
close
Published : 24/10/2021 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

F3: ఎఫ్‌-3 రిలీజ్‌ డేట్‌ చెప్పేశారుగా..!

హైదరాబాద్‌: విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ తోడళ్లులుగా నటించి నవ్వులు కురిపించిన చిత్రం ‘ఎఫ్‌-2’. 2019లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎఫ్‌-3’ రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో క్రో బ్రదర్స్‌గా కడుపుబ్బా నవ్వించడానికి వెంకీ, వరుణ్‌ ఇద్దరూ సిద్ధమవుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారా?అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ‘ఎఫ్‌-3’ రిలీజ్‌ డేట్‌ని చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ‘ఎఫ్‌-3’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు దర్శకుడు తెలిపారు. ఫుల్‌ టైమ్‌ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. దిత్‌రాజు నిర్మాత.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని