‘టెనెట్’‌ ఎప్పుడు.. ఎన్ని దేశాల్లో విడుదలంటే? - tenet movie will release in seventy countries
close
Published : 30/07/2020 02:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘టెనెట్’‌ ఎప్పుడు.. ఎన్ని దేశాల్లో విడుదలంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: హాలీవుడ్‌ చిత్రాలంటే ముందుగా గుర్తొచ్చేవి.. సూపర్‌ హీరోలు, యాక్షన్‌ సన్నివేశాలే. కానీ కాలంతో ప్రయోగ చిత్రాలు చేస్తూ హాలీవుడ్‌లో, అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేశారు దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్. ఆయన చిత్రాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారనడంలో సందేహం లేదు. ఇందుకు ‘ఇన్‌సెప్షన్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’ వంటి ప్రయోగాత్మక చిత్రాలే కారణం. ఇటీవల కాలంతో నోలన్‌ చేసిన మరో ప్రయోగమే ‘టెనెట్‌’. ఓ వ్యక్తికి భవిష్యత్తును చూడటంతోపాటు కాలాన్ని వెనక్కి తిప్పడమూ తెలుస్తుంది. అతడే జరగబోయే ప్రపంచ యుద్ధాన్ని ఆపడం కోసం అంతర్జాతీయ గూఢచర్యానికి పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లే ఇతి వృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడగా.. తాజాగా మరోసారి విడుదల తేదీని ప్రకటించారు. 

‘టెనెట్‌’ చిత్రం ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వల్ల మరోసారి విడుదల వాయిదా పడింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ వార్నర్‌ బ్రోస్‌ పిక్చర్‌ వెల్లడించింది. ఆగస్టు 26న యూకే సహా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో విడుదల చేయబోతున్నారట. అయితే అమెరికాలో మాత్రం సెప్టెంబర్‌ 3న విడుదల చేస్తామని వార్నర్‌ బ్రోస్‌ ప్రకటించింది. ఇప్పటికే కొన్ని హాలీవుడ్‌ సినిమాలు థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియక ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నా.. నోలన్‌ మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకే విడుదల తేదీని ప్రకటించి సినిమాపై మరోసారి అంచనాలు పెంచేసింది చిత్రబృందం. మరి అప్పటికి థియేటర్లు తెరుస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకమే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని