పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలి: పవన్‌ - tenth inter‌ exams should be canceled demands pawan
close
Updated : 20/04/2021 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలి: పవన్‌

అమరావతి: ఏపీలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. కరోనా విజృంభణతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారని పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వల్ల నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ప్రభుత్వం చెప్పిన షెడ్యూల్‌ ప్రకారమే పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామనడంపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల కోసం వెళ్లి వచ్చే విద్యార్థుల ద్వారా వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉందన్నారు.
 
ఏపీలో 16 లక్షల మందికి పైగా పది, ఇంటర్‌ విద్యార్థులున్నారని.. వారు కరోనా బారిన పడితే పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని పవన్‌ ప్రశ్నించారు. పరీక్షల పెట్టే విషయంలో ప్రభుత్వం సమర్థించుకున్న తీరు హాస్యాస్పదమన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోతే ఆర్మీ ఉద్యోగాలు కోల్పోతారనడం అర్థరహితమన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌సీ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. పది, ఇంటర్‌ పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంలాగే ఏపీ కూడా నిర్ణయం తీసుకోవాన్నారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు.   మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని