Pooja Hegde: కరోనాను తన్ని తరిమేశా - tested negative pooja hegde
close
Published : 06/05/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pooja Hegde: కరోనాను తన్ని తరిమేశా

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ముద్దుగుమ్మ పూజా హెగ్డే కరోనా నుంచి కోలుకుంది. ఏప్రిల్‌ 25న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆమె తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘నేను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలతో కరోనాను తన్ని తరిమేశాను. మొత్తానికి నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆమె ఆమె ట్వీట్‌ చేసింది.

పూజా చేతిలో ప్రస్తుతం భారీ చిత్రాలే ఉన్నాయి. ప్రభాస్‌తో కలిసి ఆమె ‘రాధేశ్యామ్‌’లో నటించింది. అంతేకాదు.. అక్కినేని అఖిల్‌కు జోడీగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ‘ఆచార్య’లోనూ ఆమె ఒక కీలకపాత్ర పోషించింది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సరసన మరో నటిస్తోంది. ‘దళపతి 65’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఇలా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో ఆమె చాలా బిజీగా ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని