తెవాతియా.. సెలక్టయ్యాడు.. చితక్కొట్టాడు! - tewatia blasts 39 ball 73 against chandigarh after maiden india call up
close
Published : 22/02/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెవాతియా.. సెలక్టయ్యాడు.. చితక్కొట్టాడు!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియాకు ఎంపికయ్యాననే శుభవార్త తెలిసిన తర్వాత రాహుల్‌ తెవాతియా చెలరేగిపోయాడు. చండీగఢ్‌పై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీలో హరియాణా తరఫున ఆడుతున్న తెవాతియా.. చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 39 బంతుల్లో 73 పరుగులు చేశాడు. దీనిలో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు హిమన్షు రాణా శతకంతో రాణించడంతో హరియాణా 50 ఓవర్లలో 9 వికెట్లకు 299 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్‌తో జరగనున్న అయిదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న తెవాతియాతో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషాన్‌ కూడా టీమిండియాకు ఎంపికయ్యారు. కాగా, ఎంపికపై తెవాతియా స్పందించాడు. భారత జట్టుకు ఎంపికయ్యాననే విషయం తొలుత చాహల్ చెప్పినప్పుడు నమ్మలేదన్నాడు. ఆ తర్వాత మోహిత్‌ శర్మ కూడా చెప్పడంతో సెలక్టైన విషయాన్ని తెలుసుకున్నానని తెలిపాడు. మరోవైపు సూర్యకుమార్ తన ఎంపిక వార్త తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని