విజయ్‌ సరసన కథానాయికగా పూజా హగ్డే - thalapathy 65 pooja hegde to star opposite vijay film
close
Published : 24/03/2021 22:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ సరసన కథానాయికగా పూజా హగ్డే

ఇంటర్నెట్‌ డెస్క్:   హీరో విజయ్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించనున్నారు.‘దళపతి 65’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డేని ఎంపిక చేశారు. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన ట్వీటర్ వేదికగా ప్రకటించింది. సినిమా ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. పూజా హెగ్డే తొలుత తమిళంలో ‘ముగమూడి’ చిత్రంతోనే వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించలేదు. మళ్లీ దశాబ్దం తర్వాత ఇప్పడు విజయ్‌ సరసన నటించే అవకాశం వచ్చింది. ‘దళపతి 65’కి సినిమాటోగ్రాఫర్‌గా మనోజ్‌ పరమహంస వ్యవహరించనున్నారు. ఇంకా చిత్రంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి వార్త ధ్రువీకరించలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోంది. అఖిల్‌ అక్కినేనితో కలిసి ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ప్రభాస్‌తో కలిసి ‘రాధేశ్యామ్‌’ చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది జూన్‌, జులైలోనే విడుదల కానున్నాయి. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని