అమెజాన్‌ ప్రైమ్‌లో విజయ్‌ ‘మాస్టర్‌’ - thalapathy vijay master film digital premiere will be on jan 29th
close
Published : 28/01/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌ ప్రైమ్‌లో విజయ్‌ ‘మాస్టర్‌’

హైదరాబాద్‌: తమిళ నటుడు విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్‌’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కథానాయకుడిగా విజయ్‌, ప్రతినాయకుడిగా విజయ్‌ సేతుపతిలు పోటాపోటీగా నటించారు. కాగా, జనవరి 29వ తేదీ నుంచి ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

విజయ్‌ నటించిన మాస్టర్‌ చిత్రాన్ని తమ ఓటీటీలో విడుదల చేయడం ఆనందంగా ఉందని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇండియా హెడ్‌ విజయ్‌ సుబ్రమణియమ్‌ తెలిపారు. అభిమానులు, ప్రేక్షకులు ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘మాస్టర్‌’ ఒకటని, అలాంటి చిత్రాన్ని ప్రైమ్‌ చందాదారుల కోసం తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. జాన్‌-భవానీల మధ్య పోరును థియేటర్‌లలో చూసి ఎంజాయ్‌ చేసిన అభిమానులు ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా మరోసారి ఈ యాక్షన్‌ డ్రామాను చూసి ఆస్వాదిస్తారని నటుడు విజయ్‌ అన్నారు. ప్రైమ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్‌ అభిమానులకు ఈ చిత్రం మరింత చేరువ అవుతుందని దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి..

ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌: ఇది అన్యాయంAdvertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని