Thalapathy Vijay: భారత్‌లో నం.1.. ప్రపంచంలో నం.2 - thalapathy vijay sets news twitter record
close
Published : 23/06/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Thalapathy Vijay: భారత్‌లో నం.1.. ప్రపంచంలో నం.2

దేశంలోనే అత్యధికులు హాజరైన ట్విటర్‌ సెషన్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తళపతి విజయ్‌ అంటేనే రికార్డుల రారాజు. బాక్సాఫీస్‌ కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టడంలోనే కాదు.. సోషల్‌ మీడియాలోనూ ఈ తమిళ స్టార్‌కు క్రేజ్‌ ఒక రేంజ్‌లో ఉంటుంది. ఏ సినిమా ట్రైలర్‌ విడుదలైనా అది క్షణాల్లో ట్రెండింగ్‌లోకి దూసుకెళుతుంది. ఇదిలా ఉండగా.. విజయ్ జన్మదినం సందర్భంగా ట్విటర్‌లో అరుదైన రికార్డు నమోదైంది. జూన్‌ 21న విజయ్‌ బృందం ట్విటర్‌ సెషన్‌ ఏర్పాటు చేసింది. అత్యధిక మంది హాజరైన సెషన్‌గా ఇది రికార్డు సృష్టించింది. ఇందులో 27,500 మంది పాల్గొన్నారు. మనదేశంలో ఎక్కువమంది పాల్గొన్న సెషన్‌లో ఇదే మొదటిదిగా నిలిచింది. అలాగే ప్రపంచంలో రెండోదిగా కూడా గుర్తింపు పొందింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన బామ్‌బామ్‌ అనే ర్యాపర్‌ ఏర్పాటు చేసిన సెషన్‌లో అత్యధికంగా 44,000మంది పాల్గొన్నారు. ఆ తర్వాత విజయ్‌దే రికార్డు.

ఈ సెషన్‌లో పలువురు సినిమా తారలతో పాటు విజయ్‌ కూడా పాల్గొన్నారు. హీరోయిన్లు కీర్తి సురేశ్‌, మాళవికా మోహనన్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌,  ‘బీస్ట్‌’ దర్శకుడు దిలీప్‌కుమార్‌ పాల్గొని విజయ్‌తో తమ సినిమా ప్రయాణాన్ని పంచుకున్నారు. విజయ్‌ పుట్టినరోజును పురస్కరించుకొని అతడు నటించిన 65వ చిత్రం ‘బీస్ట్‌’ ఫస్ట్‌లుక్‌, సెకండ్‌ లుక్‌ పోస్టర్‌లను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అవి కూడా ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళుతున్నాయి. నెల్సన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని