పవన్‌ కోసం తమన్‌ ఫోక్‌ సాంగ్‌? - thaman to record a folk song with pawan kalyan
close
Updated : 22/06/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ కోసం తమన్‌ ఫోక్‌ సాంగ్‌?

ఇంటర్నెట్‌డెస్క్‌: విరామం తర్వాత అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ‘వకీల్‌సాబ్’తో విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు. యువ నటుడు రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ సంభాషణలు అందిస్తుండటం విశేషం.

ఇటీవల కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో సినిమాను తిరిగి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్ర బృందం యోచిస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు చకచకా సాగిపోతున్నాయి. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో పవన్‌ కోసం ఓ ఫోక్‌ సాంగ్‌ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు తమన్‌. ద్వితీయార్ధంలో ఈ పాట వస్తుందని సమాచారం. అంతేకాదు, ఫోక్‌ సాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న పెంచల్‌దాస్‌ ఈ పాటను ఆలపించనున్నారట. అయితే, దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. మలయాళ చిత్రం ‘అప్పయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’లో బిజూ మేనన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలను తెలుగులో పవన్‌కల్యాణ్‌, రానాలు పోషిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని