The Battle at Lake Changjin: హాలీవుడ్‌కు సవాలు విసిరిన చైనా సినిమా - the chinese film beating bond and marvel at the box office
close
Updated : 17/10/2021 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

The Battle at Lake Changjin: హాలీవుడ్‌కు సవాలు విసిరిన చైనా సినిమా

 రికార్డులు సృష్టిస్తున్న ‘ది బ్యాటిల్‌ ఎట్‌ లేక్‌ చాంగ్జిన్‌’

 ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన ‘ది బ్యాటిల్‌ ఎట్‌ లేక్‌ చాంగ్జిన్‌’ చిత్రం భారీగా కలెక్షన్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. కొరియా యుద్ధంలో చైనా సైన్యం అమెరికాను ఓడించిన కథ ఆధారంగా దీనిని నిర్మించారు.  రెండు వారాల్లో ఇది బాక్సాఫీస్‌ల వద్ద 633 మిలియన్‌ డాలర్లు (రూ.4.7వేల కోట్లు) వసూలు చేసింది. మార్వెల్స్‌ షాంగ్‌-ఛి వసూలు చేసిన మొత్తం కంటే ఇది చాలా ఎక్కువ. చైనాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచే దిశగా ఇది వెళుతోంది. యుద్ధాల్లో చైనా గొప్పదనాన్ని చిత్రీకరించేందుకు ఇదో మంచి ఫార్ములాగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ఈ చిత్రం ఇంత వసూలు చేయడానికి ఓ కారణం ఉంది. హాలీవుడ్‌ దిగ్గజ సినిమాలైన నో టైమ్‌ టూ డై,డూన్‌ వంటి చిత్రాలు అక్టోబర్‌ చివరి వరకు చైనాలో విడుదల కావు.  ది బ్యాటిల్‌ ఎట్‌ లేక్‌ చాంగ్జిన్ చైనాలో ముఖ్యమైన దినోత్సవాలు ఉన్న సమయంలో విడుదలైంది. ఈ ఏడాది కమ్యూనిస్టు పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవం సెలవుల సమయంలో దీనిని విడుదల చేసింది. ఇలాంటి ప్రచార చిత్రాలను చైనా కమ్యూనిస్టు పార్టీ కేడర్‌ చూడటం తప్పనిసరి చేస్తారు. 200 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీసిన ఈ చిత్రంపై చైనాలో అన్ని రివ్యూలు సానుకూలంగా రావడంపై కూడా అనుమానాలు ఉన్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని