close
Published : 19/01/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అభిమానులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బ్రేకింగ్‌ న్యూస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎట్టకేలకు సినిమా అభిమానులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో శుభవార్త చెప్పేసింది. చిత్రీకరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్తను అభిమానులతో పంచుకుంది. క్లైమాక్స్‌ షూట్‌ మొదలైందంటూ ట్వీటర్‌లో పోస్టు చేసింది. లక్ష్యాన్ని సాధించేందుకు రామరాజు, భీమ్‌ వస్తున్నారంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది. దీంతో పాటు ఆఖరి పోరాటానికి సంబంధించిన ఒక ఫొటోను కూడా పంచుకుంది. చారిత్రక పాత్రలకు ఫిక్షనల్‌ స్టోరీని జోడించి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా అలియాభట్‌, తారక్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఓలివియా మోరిస్‌ సందడి చేయనున్న విషయం తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత.

ఇదీ చదవండి..

‘గని’గా వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌!

 


1351477061886480385

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని