కేసీఆర్‌ నిర్ణయంపై మంచు విష్ణు ఆనందం - the entire teaching community is grateful to you says vishnu
close
Published : 12/04/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేసీఆర్‌ నిర్ణయంపై మంచు విష్ణు ఆనందం

హైదరాబాద్‌: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నటుడు మంచు విష్ణు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయులందరూ ఎంతో సంతోషిస్తున్నారని అన్నారు. ఈ మేరకు  సోమవారం ఉదయం విష్ణు ఓ ట్వీట్‌ చేశారు. ‘కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతినెలా వాళ్లకి రూ.2000 నగదు, 25 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించడం ఓ అద్భుతం. ఈ నిర్ణయంతో విద్యారంగంలో ఉన్న ఎంతో మంది ఉపాధ్యాయులకు మీపై మరెంతో గౌరవం పెరిగింది’ అని విష్ణు పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని