ధనుష్‌ ‘ది గ్రే మ్యాన్‌’ - the gray man shoot starts
close
Published : 18/03/2021 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధనుష్‌ ‘ది గ్రే మ్యాన్‌’

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షణాది తారలు హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల్లో అతిథులుగా మెరవడం అరుదుగా కన్పిస్తుంటుంది. అలాంటిది తమిళ నటుడు ధనుష్‌ ఏకంగా హాలీవుడ్‌ సినిమాలో ముఖ్యపాత్ర దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న ‘ది గ్రే మ్యాన్‌’ చిత్రీకరణ బుధవారం ప్రారంభమైంది. ఈ సినిమా గతేడాది సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులతో ఆలస్యంగా ప్రారంభమైంది. దర్శకద్వయం రూసో బ్రదర్స్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు ఛారీస్‌ ఎవన్స్, రేయాన్‌ గోస్లింగ్‌ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. ఈ విషయాన్ని రూసో బ్రదర్స్‌ తమ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని