సెహ్వాగ్ వల్లే ఐపీఎల్‌కు భారీ రేటింగ్‌: దాదా - the only reason for high ratings is viru sourav ganguly
close
Published : 22/11/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెహ్వాగ్ వల్లే ఐపీఎల్‌కు భారీ రేటింగ్‌: దాదా

ఇంటర్నెట్‌డెస్క్: సామాజిక మాధ్యమాల్లో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ ఎంతో చురుకుగా ఉంటాడు. ప్రస్తుత పరిస్థితులను తనదైన శైలిలో ఆసక్తిగా వివరిస్తుంటాడు. అంతేగాక తన ఫొటోలను, జ్ఞాపకాలను తరచూ పంచుకుంటుంటాడు. తాజాగా తన చిత్రాన్ని శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘‘ఎడమ వైపు ఏది వెళ్లకపోతే మీరు కుడి వైపుకి వెళ్లండి’’ అని దానికి వ్యాఖ్య జత చేశాడు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆ పోస్ట్‌కు కామెంట్ చేశాడు.

‘‘ఏం చెప్పావ్‌ వీరూ.. నువ్వు ఇంకా ఫిట్‌గా, అందంగా ఉన్నావు. ఐపీఎల్‌కు చాలా ఎక్కువ రేటింగ్స్ వచ్చాయంటే దానికి కారణం ‘వీరూ కి బైతక్‌’ కార్యక్రమమే’’ అని దాదా కామెంట్ చేశాడు. దీనికి సెహ్వాగ్‌ ‘‘ఐపీఎల్ విజయవంతమైందంటే దానికి కారణం మీరు, బీసీసీఐ కార్యదర్శి జై షా’’ అని బదులిచ్చాడు. ఐపీఎల్ మ్యాచ్‌లను సెహ్వాగ్‌  ‘వీరూ కీ బైతక్’ అనే కార్యక్రమంలో విశ్లేషించిన సంగతి తెలిసిందే. రాణించిన క్రికెటర్లును కొనియాడుతూ, గెలుపోటముల కారణాలను వివరించేవాడు. అంతేగాక, విఫలమైన ఆటగాళ్లను వ్యంగ్యాస్త్రాలతో విమర్శించేవాడు. కాగా, వీక్షకుల సంఖ్యలో యూఏఈ వేదికగా జరిగిన పదమూడో సీజన్‌ రికార్డులు సృష్టించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని