తొలిసారి లింగ సమానత్వాన్ని సాధించిన ఒలింపిక్స్‌ - the tokyo olympics will be the games of all mothers
close
Published : 24/07/2021 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలిసారి లింగ సమానత్వాన్ని సాధించిన ఒలింపిక్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలిసారి లింగ సమానత్వాన్ని సాధించిన ఒలింపిక్స్‌గా తాజా క్రీడా పోటీలు ఉండబోతున్నాయని గత మార్చిలోనే ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ, టోక్యో ఒలింపిక్‌ నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఈసారి దాదాపు 49 శాతం మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. భవిష్యత్తులో అమ్మాయిలు క్రీడల్లో మరింత ఎక్కువగా రాణించేలా టోక్యో ఒలింపిక్స్‌ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. అయినా ఇప్పటికీ గర్భధారణ, పిల్లల ఆలనాపాలనా వల్ల మహిళా అథ్లెట్లు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న తల్లులు!

గతంలో కంటే 2021 టోక్యో ఒలింపిక్స్‌లో ఎంతోమంది తల్లులు పాల్గొనడం కనిపిస్తోంది. ప్రసిద్ధ కెనడియన్‌ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి కిమ్‌ బౌచెర్‌ తన మూడు నెలల చిన్నారిని టోక్యోకు తీసుకుని వచ్చేందుకు అనుమతించాల్సిందిగా సోషల్‌ మీడియా ద్వారా విన్నవించుకుంది. కొవిడ్‌ నేపథ్యంలో కుదరదని ఒలింపిక్ నిర్వాహక కమిటీ వద్దని చెప్పింది. కానీ, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో చివరికి అంగీకరించింది.  కెనడా బాక్సర్‌ మాండీ బుజోల్డ్‌ 2018లో గర్భం ధరించి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే అంతకుముందు వరుసగా మూడు టోర్నమెంట్లలో ర్యాంకులను బట్టే అనుమతించాలనే నిబంధన ఉంది. ప్రెగ్నెన్సీ వల్ల దాన్ని పరిపూర్ణం చేయలేకపోయానని ఆమె వాదించింది. చివరికి ఆమెకు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు జూన్‌ 30న అనుమతి దక్కింది. అమెరికన్‌ స్ప్రింటర్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ గతంలో నాలుగు ఒలింపిక్స్‌లో పాల్గొని ఆరు బంగారు పతకాలు సాధించింది. అనేక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఆమె 2019లో గర్భం ధరించింది. ఇక తన కెరీర్‌నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చిందనుకుంటున్న తరుణంలో టోక్యో ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారిగా ఓ తల్లి హోదాలో పాల్గొనబోతోంది. మొదటిసారి హెలెన్‌ గ్లోవర్‌ తల్లి హొదాలో బ్రిటిష్‌ రోవింగ్‌ టీమ్‌ తరఫున పాల్గొంటున్నారు. ఆమె ఇదివరకే అనేక పతకాలు సాధించారు.

వీళ్లే కాకుండా అనేక దేశాల్లోంచి చాలామంది మహిళలు ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఇప్పుడు మిక్స్‌డ్‌ ఈవెంట్స్‌ గతంలో ఉన్న తొమ్మిది కంటే రెట్టింపయ్యాయి.  మొత్తం 206 జాతీయ ఒలింపిక్‌ కమిటీల్లో అన్నింట్లోనూ కనీసం ఒక్క మహిళైనా ఉన్న తొలి ఒలింపిక్స్‌ ఇవే.  ‘‘ఐఓసీ లింగ సమానత్వానికి కట్టుబడి ఉంది. లింగసమానత్వం గల క్రీడా ప్రపంచాన్ని చూడాలనేదే మన ముందున్న మైలురాయి’’ అని ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షులు థామస్‌ బ్యాచ్‌ ప్రకటించారు.  భారతదేశం నుంచి దీపికా కుమారి(ఆర్చరీ), పి.వి.సింధు(బ్యాడ్మింటన్‌),  లావ్లీనా బోర్గయిన్, సిమ్రన్‌జిత్‌ కౌర్‌(బాక్సింగ్‌) తదితర మహిళా అథ్లెట్లు పాల్గొంటున్న సంగతి విదితమే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని