114కు చేరిన యూకే రకం కేసులు - the total number of persons found positive with uk strain of covid 19 is 114
close
Published : 15/01/2021 18:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

114కు చేరిన యూకే రకం కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ యూకే స్ట్రెయిన్‌ కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా శుక్రవారం మరో ఐదుగురికి స్ట్రెయిన్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కొత్తరకం కేసుల సంఖ్య 114కు పెరిగింది. బ్రిటన్‌లో ఈ రకం వెలుగుచూసిన వెంటనే అప్రమత్తమైన భారత్‌.. ఆ దేశానికి కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఆ తర్వాత జనవరి 8 నుంచి తిరిగి సేవలు ప్రారంభించినప్పటికీ.. యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో కరోనా పాజిటివ్‌గా తేలిన వారి రక్తనమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపుతున్నారు. అలా ఇప్పటివరకు 114 మందికి స్ట్రెయిన్‌ సోకగా.. ప్రస్తుతం వారంతా ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టీకా పంపిణీని ప్రారంభిస్తారని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. 

ఇవీ చదవండి..

వ్యాక్సినేషన్‌.. ఈ రూల్స్‌ మర్చిపోవద్దు

మహమ్మారిపై భారత్‌ పోరు ప్రశంసనీయంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని