టీకాలపై ఆప్షన్‌ లేదు..! - there is no option to take vaccine
close
Published : 13/01/2021 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకాలపై ఆప్షన్‌ లేదు..!

స్పష్టంచేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ జనవరి 16న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అత్యవసర వినియోగం కింద అనుమతి పొందిన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే ఆప్షన్‌ ప్రజలకు ప్రస్తుతానికి ఉండబోదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. అనేక దేశాల్లో ఒకటి కన్నా ఎక్కువ టీకాలు సరఫరా అవుతున్నప్పటికీ ఎక్కడా ప్రజలకు ఇలాంటి ఎంపిక స్వేచ్ఛను ఇవ్వలేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్‌ వెల్లడించారు. రెండు డోసులను 28రోజుల వ్యవధిలో తీసుకోవాలని, వ్యాక్సిన్‌ తీసుకున్న 14రోజుల తర్వాతే వాటి ప్రభావం ప్రారంభమవుతుందని తెలిపారు. అప్పటివరకు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇక ఈ రెండు వ్యాక్సిన్‌లు వేల మందిపై పరీక్షించారని, అవి సురక్షితమైనవేనని నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్‌ స్పష్టంచేశారు. భారతీయ వ్యాక్సిలన్నీ సురక్షితమని, సమర్థవంతంగా పనిచేస్తాయని, ప్రజలు వాటిని నిస్సంకోచంగా పొందవచ్చని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. ఇదిలాఉంటే, భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొవిషీల్డ్‌ టీకాలు దేశవ్యాప్తంగా నిర్ధేశించిన ప్రాంతాలకు తరలించగా, కొవాగ్జిన్‌ టీకాల రవాణా ప్రారంభమైంది.

ఇవీ చదవండి..
నగరాలకు చేరిన టీకాలు
అది నిజంగా చైనా టీకానే..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని