MaheshBabu: ప్చ్‌.. ఫ్యాన్స్‌కు నిరాశే - there is no update from sarkaruvaaripaata on may31 says team mahesh babu
close
Published : 27/05/2021 09:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MaheshBabu: ప్చ్‌.. ఫ్యాన్స్‌కు నిరాశే

ట్వీట్‌ చేసిన సూపర్‌స్టార్‌ టీమ్‌

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులకు నిరాశ ఎదురయ్యింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని మే 31న ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని ఎంతోకాలం నుంచి అందరూ చెప్పుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రీత్యా మహేశ్‌ తదుపరి చిత్రాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదని మహేశ్‌బాబు టీమ్‌ ట్వీటర్‌ వేదికగా వెల్లడించింది. దీంతో అభిమానులు కాసింత నిరాశకు గురయ్యారు.

‘సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తమ తదుపరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని చిత్రబృందం భావించింది. సినిమా అప్‌డేట్‌ గురించి ఎవరూ కూడా అనధికారికంగా, అవాస్తవాలను దయచేసి సృష్టించవద్దు. సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్‌నైనా అధికారిక ఖాతాల్లో తప్పకుండా పోస్ట్‌ చేస్తాం. అప్పటివరకూ దయచేసి జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా జీవించండి’ అని టీమ్‌ పేర్కొంది.

ఇక, ‘సర్కారువారి పాట’ విషయానికి వస్తే.. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రమిది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తిసురేశ్‌ కథానాయిక. గత కొన్నిరోజుల క్రితం ఈ సినిమా షూట్‌ దుబాయ్‌లో జరిగింది. మరోవైపు ఈ సినిమాలో మహేశ్‌.. పొడవాటి జుట్టు, మెడపై పచ్చబొట్టుతో మాస్‌ లుక్‌ విభిన్నంగా కనిపించనున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని