Ts news: రేవంత్‌ తప్పేమి లేదు..తప్పంతా నాదే: జగ్గారెడ్డి - there is nothing wrong with rewanth its my mistake says jaggareddy
close
Updated : 26/09/2021 04:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts news: రేవంత్‌ తప్పేమి లేదు..తప్పంతా నాదే: జగ్గారెడ్డి

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యల్లో రేవంత్‌ తప్పు లేదని.. తప్పంతా తనదేనని ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఒప్పుకొన్నారు. నిన్న తాను మీడియా ముందు వచ్చి నేరుగా మాట్లాడటం తప్పని.. తన తప్పును ఒప్పుకొని పార్టీకి క్షమాపణ చెప్పారు. రేవంత్‌రెడ్డి, తాను అన్నదమ్ముల్లాంటి వాళ్లమని తెలిపారు. మీడియా ముందు అలా మాట్లాడొద్దని పార్టీ ఇంఛార్జి చెప్పారని పేర్కొన్నారు. ఇక నుంచి నేరుగా పార్టీ వ్యవహారాలు మీడియాతో మాట్లాడనని జగ్గారెడ్డి వెల్లడించారు.

జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించేలా ఉన్నాయన్న అభిప్రాయంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ రంగంలోకి దిగారు. ఈ విషయమై గాంధీభవన్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షుల సమావేశం నిర్వహించారు. రేవంత్‌ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్‌లతోపాటు మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్ సమావేశమయ్యారు. రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డిని వివరణ కోరారు. సమావేశం అనంతరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. జగ్గారెడ్డి నిన్న మాట్లాడిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారన్నారు. సమాచారలోపంతోనే నిన్నటి వివాదం రాజుకుందని తెలిపారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని