‘పొన్నియన్‌ సెల్వన్’‌ సీక్వెల్‌ తక్కువ వ్యవధిలో విడుదల! - there will be a big break in the release of the ponnian selvan sequel!
close
Published : 13/02/2021 23:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పొన్నియన్‌ సెల్వన్’‌ సీక్వెల్‌ తక్కువ వ్యవధిలో విడుదల!

ఇంటర్నెట్‌డెస్క్: మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్ఠాత్మక, భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్’‌. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం, సినిమా మొదటి భాగం విడుదలైన ఆరు నెలలు లేదా అంతకంటే ఇంకా తక్కువ సమయంలోనే రెండో భాగాన్ని విడుదల చేయాలని నిర్మాణ సంస్థ యోచిస్తోంది. వచ్చే ఏడాది తమిళంలో పెద్ద హీరోల సినిమాలు విడుదల తేదీలు ఇప్పటికే ప్రకటించాయి. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందుతున్న ‘పొన్నియన్‌ సెల్వన్’‌లో విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, త్రిష తదితరులు నటిస్తున్నారు. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తోన్న చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్‌ స్వరాలు అందిస్తున్నారు. 140 రోజుల పాటు షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమా దాదాపు యాభై శాతంపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మార్చి తరువాత చిత్రబృందం నలభై రోజుల పాటు ఉత్తర భారతదేశంలో చిత్రీకరణ కోసం వెళ్లనున్నట్లు సమాచారం.  

ఇవీ చదవండి..!

‘రాధేశ్యామ్’‌ కోసం పూజా డబ్బింగ్‌!

శంకర్‌-చరణ్‌ మూవీ: ఆసక్తికర విషయాలివే!

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని