‘ఖైదీ’ సీక్వెల్‌కి రంగం సిద్ధం..! - there will be a second part for khaidi says producer sr prabhu
close
Published : 27/05/2021 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఖైదీ’ సీక్వెల్‌కి రంగం సిద్ధం..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అటు తమిళ అభిమానులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటుడు కార్తి. సినిమా-సినిమాకు మధ్య వ్యత్యాసం చూపిస్తూ అలరిస్తూ వస్తున్నాడు. ఇటీవల వచ్చి అందర్నీ ఆకట్టుకున్న చిత్రం ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ రొటీన్‌ సినిమాల్లా కాకుండా కాస్త భిన్నంగా తెరకెక్కించారు. పాటలు, డ్యాన్సులు లేకుండానే ఈ చిత్రం మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. కార్తీ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం సీక్వెల్‌ గురించి చర్చలు సాగుతున్నాయి. దానికి చిత్రబృందం నుంచి ఇన్నాళ్లు ఎలాంటి స్పందనా రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా చిత్ర నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్రభు దీనిపై ఓ హింట్‌ ఇచ్చారు.

‘ఖైదీ’కి కచ్చితంగా సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని ఖరారు చేశారు. హీరో కార్తి, డైరెక్టర్‌ కనగరాజ్‌ ఎప్పుడంటే అప్పుడు సినిమా చిత్రీకరణ మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆయన చెప్పారు. మరోవైపు కార్తి ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’, పి.ఎస్‌.మిత్రన్‌తో ‘సర్దార్‌’ చిత్రాల్లో చేస్తున్నాడు. మరోవైపు లోకేశ్‌ కనగరాజ్‌ సైతం బిజీగా ఉన్నారు. ఆయన కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌’ చేస్తున్నారు. తర్వాత మరో తమిళ స్టార్‌హీరో విజయ్‌తో కలిసి ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  ఈ లెక్కన ఒకవేళ ‘ఖైదీ’ సీక్వెల్‌ ఉంటే అది పట్టాలెక్కేందుకు మరో రెండేళ్లు ఆగాల్సిందేనన్నమాట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని