శంకర్‌-చరణ్‌ మూవీ: ఆసక్తికర విషయాలివే! - these are interesting points about ram charan shankar movie
close
Published : 13/02/2021 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శంకర్‌-చరణ్‌ మూవీ: ఆసక్తికర విషయాలివే!

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ కెరీర్‌లో ఒక్కసారైనా శంకర్‌తో సినిమా చేయాలని ఉవ్విళ్లూరే కథానాయకులు ఎంతోమంది ఉన్నారు. భారీదనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే శంకర్‌ దర్శకత్వంలో నటించే అవకాశం యువ కథానాయకుడు రామ్‌చరణ్‌కు దక్కింది.

శంకర్‌ తన మొదటి చిత్రం ‘జెంటిల్‌మెన్‌’ కోసం కథానాయకుడిగా చిరంజీవిని కూడా అనుకున్నారట. కానీ, అప్పటి పరిస్థితుల్లో అది సాధ్యపడలేదు. ఆ సినిమా అర్జున్‌తో తీయగా..  బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే, ఇదే కథను చిరంజీవితో హిందీలో ‘ది జెంటిల్‌మెన్‌’ పేరుతో మహేశ్‌భట్‌ తీశారు. ఆ తర్వాత చిరుతో శంకర్‌ కలిసి పనిచేసే అవకాశం రాలేదు. అయితే, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరు తనయుడితో శంకర్‌ పనిచేస్తుండటం విశేషం. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

* ‘జెంటిల్‌మెన్‌’తో కెరీర్‌ను ప్రారంభించిన శంకర్‌ దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్‌చరణ్‌తో తీస్తున్న సినిమా శంకర్‌కు 15వ సినిమా కావడం విశేషం.

* అలాగే ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్‌కు కూడా ఇది 15వ చిత్రమవడం గమనార్హం.

* దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా.

* శంకర్‌ తొలిసారి నేరుగా తెలుగులో అదీ తెలుగు హీరోతో సినిమా తీస్తున్నారు.

* చరణ్‌ - శంకర్‌ కలయిక, పాన్‌ ఇండియా స్థాయి సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

* శంకర్‌ చిత్రాల్లో కనిపించే భారీదనంతో పాటు, రామ్‌చరణ్‌ నుంచి అభిమానులు కోరుకునే మాస్‌ అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయట.

* ఇప్పటివరకూ రామ్‌చరణ్‌ చేయని సరికొత్త పాత్రలో శంకర్‌ చెర్రీని చూపించనున్నారు.

* పాన్‌ ఇండియా సినిమా కావడంతో తారాగణం కూడా భారీగానే ఉండనుంది.

‘‘ఇది మాకొక మైలురాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై 50వ చిత్రంగా ఇంతకు ముందెప్పుడూ చూడని రెండు బలమైన శక్తులను కలిపి తెరపై చూపించబోతున్నాం. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఇండియన్‌ సినిమా షో మెన్‌ శంకర్‌లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’’ -ట్విటర్‌లో చిత్ర నిర్మాణ సంస్థ.

ఇవీ చదవండి..!

సమంత బాటలోనే నాగచైతన్య?

అందుకే ప్రభాస్‌ని పరిచయం చేయలేకపోయా!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని