వీటిని ఇలా కూడా వాడచ్చు! - these household items with multiple uses in Telugu
close
Published : 16/09/2021 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీటిని ఇలా కూడా వాడచ్చు!

అల్యూమినియం ఫాయిల్‌లో ఫుడ్‌ ర్యాప్‌ చేస్తాం.. టెన్నిస్ బంతులతో టెన్నిస్‌ ఆడతాం.. పెట్రోలియం జెల్లీతో అందానికి మెరుగులు దిద్దుతాం.. ఇలా ఇంట్లో ఉండే వస్తువులు, పదార్థాలను ఆయా పనుల కోసం వినియోగిస్తుంటాం. కానీ వీటిని ఇలా కాకుండా ఇతర పనుల కోసం కూడా వినియోగించచ్చన్న విషయం మీకు తెలుసా? అవును.. అలాంటి వస్తువులు మనింట్లో చాలానే ఉంటాయి. ఇంతకీ అవేంటి.. వాటిని ఎలా వాడాలి.. అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇలా..!

* మట్టిపాత్రలు, నాన్‌స్టిక్‌ ప్యాన్స్‌ ఇప్పుడు ప్రతి ఇంట్లో భాగమైపోయాయి. అయితే వంట చేసే క్రమంలో వాటిపై పడే కఠినమైన మరకల్ని వదిలించడానికి స్టీల్‌ స్క్రబ్బర్‌ వాడితే అవి డ్యామేజ్‌ అవుతాయి. కాబట్టి మనం ఆహారం ర్యాప్‌ చేసుకునే అల్యూమినియం ఫాయిల్‌ను ఇందుకోసం వినియోగించచ్చు.

ఇదే అల్యూమినియం ఫాయిల్‌ను దుస్తులు ఐరన్‌ చేసుకునే టేబుల్‌పై ఉన్న క్లాత్‌ కింద పరిస్తే ఐరన్‌ చేయడం త్వరగా పూర్తవుతుంది.

* ఇంట్లో ఉండే కుర్చీలు, బల్లలు, మంచాలకు ఫ్లోర్‌ ప్రొటెక్టర్స్‌ అమరి ఉంటాయి. తద్వారా వాటిని లాగినా ఫ్లోర్‌పై గీతలు పడకుండా ఉంటాయి. అయితే ఒకవేళ అవి పగిలిపోతే.. వాటికి బదులుగా ఇంట్లో పనికి రాకుండా పడి ఉన్న బాల్స్‌ని ఉపయోగించుకోవచ్చు. అదెలాగంటే పగిలిన బాల్స్‌లోకి కుర్చీ/మంచం కాళ్లను చొప్పిస్తే సరి!

* అటు ఆరోగ్యానికి, ఇటు సౌందర్య పోషణలో ఉపయోగపడే ఆలివ్‌ నూనె చెక్క వస్తువుల్ని మెరిపించడానికీ ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక డస్టర్‌పై కాస్త ఆలివ్‌ నూనె వేసి ఆయా వస్తువుల్ని తుడిచేస్తే తేడా మీకే తెలుస్తుంది.

* తలుపులు, కిటికీలు, అల్మరాలు.. వంటివి వాటి జాయింట్స్‌ దగ్గర మృదుత్వాన్ని కోల్పోయి.. ఓపెన్‌ చేయగానే అదో రకమైన శబ్దం వినిపిస్తుంటుంది. అలాంటప్పుడు కాస్త పెట్రోలియం జెల్లీని ఆ జాయింట్స్‌ దగ్గర పూసి చూడండి.

* వంటింట్లో ఉండే స్పూన్లు.. కంటి అలసటను తగ్గించడానికీ ఉపయోగపడతాయి. ఇందుకోసం ఒక చెంచాను రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టేయండి. ఉదయాన్నే ఆ చెంచాను కంటిపై పెట్టుకొని కాసేపు ఉండండి. ఇలా చేయడం వల్ల అలసిన కళ్లకు సాంత్వన చేకూరుతుంది. అలాగే కళ్ల దగ్గర వాపు కూడా కనుమరుగవుతుంది.

* ఒక్కోసారి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం. అది అలా ఎక్కువసేపు ఉంటే విషపూరితమవుతుంది.. అలాగే వడలిపోతుంది కూడా! అదే ఆ కట్‌ చేసిన లేయర్‌పై కాస్త ఛీజ్‌ పూసి చూడండి.. ఎక్కువ సమయం తాజాగా ఉండడంతో పాటు విషపూరితం కాకుండా జాగ్రత్తపడచ్చు.

* పిల్లలకు మసాజ్‌ చేసే బేబీ ఆయిల్‌ని సౌందర్య పోషణలో వాడుతుంటాం. అయితే అదే ఆయిల్‌ని ఇరుక్కుపోయిన జిప్పర్స్‌ని మృదువుగా చేయడానికి కూడా ఉపయోగించచ్చు. అందుకోసం కొన్ని చుక్కల బేబీ ఆయిల్‌ని జిప్‌పై వేసి కాసేపు అలాగే ఉంచితే జిప్‌ ఈజీగా అటూ ఇటూ కదులుతుంది.

* వంటింట్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడే బేకింగ్‌ సోడా.. దుస్తుల్ని మెరిపించడానికీ వాడచ్చు. ఇందుకోసం బట్టలు ఉతికేటప్పుడు ఉపయోగించే డిటర్జెంట్‌ పౌడర్‌లో కొద్దిగా బేకింగ్‌ సోడాను కలిపి చూడండి.

* హెయిర్‌స్ప్రే జుట్టునే కాదు.. షూస్‌ని కూడా మెరిపిస్తుంది. అదెలాగంటే.. పాలిష్‌ చేసిన షూస్‌పై కాస్త హెయిర్‌స్ప్రేను స్ప్రే చేసి చూడండి. అలాగే దుస్తులు, ఫర్నిచర్‌పై పడిన సిరా మరకల్ని సైతం ఇది తొలగిస్తుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని