రాబోయే సినిమాకు ‘తిమ్మరుసు’ ఆక్సిజన్‌ ఇవ్వాలి: నాని - thimmarusu should give oxygen to upcoming movie says nani
close
Published : 27/07/2021 23:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాబోయే సినిమాకు ‘తిమ్మరుసు’ ఆక్సిజన్‌ ఇవ్వాలి: నాని

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో పడిందని. ‘తిమ్మరుసు’ చిత్రం తర్వాత విడుదల కాబోతున్న సినిమాకు ఆక్సిజన్‌ ఇవ్వాలని కోరుకుంటున్నానని అని టాలీవుడ్‌ కథానాయకుడు నాని అన్నారు. సత్యదేవ్‌ ప్రధానపాత్రలో శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా టాక్సీవాలా హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడారు.. ‘‘ఈ సినిమాలో చాలామంది నాకు కావాల్సిన వాళ్లు ఉన్నారు. మొదటినుంచి సత్య అంటే చాలా ఇష్టం. ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఇష్టమే. అతను ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు. తన నటుడిగా ప్రయాణం ఎప్పుడో మొదలు పెట్టాడు.. ఇప్పుడు ‘తిమ్మరుసు’తో ఒక స్టార్‌గా ప్రయాణం మొదలుపెట్టబోతున్నాడు. సినిమా అనేది మనకు ఎంతో వినోదం ఇస్తుంది. వినోదం ఎక్కువగా ఉంటే ఆ దేశంలో ప్రజలు ఆనందంగా ఉంటారు. థియేటర్లో సినిమా చూడటం అనేది మన కల్చర్‌. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా ఆస్వాదిద్దాం. త్వరలోనే ఈ కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశిద్దాం. థర్డ్‌వేవ్‌లాంటివి ఏవీ రాకుండా.. అన్ని సినిమాలను థియేటర్‌లలో అందరం కలిసి ఆస్వాదించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నింటికి ‘తిమ్మరుసు’ ఆక్సిజన్‌ ఇవ్వాలి’’ అని నాని అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని