ఫిట్‌నెస్‌ అంటే కనిపించే శరీరమే కాదు: దీపిక - this is what fitness means to deepika padukone
close
Published : 11/03/2021 18:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిట్‌నెస్‌ అంటే కనిపించే శరీరమే కాదు: దీపిక

ముంబయి: ఫిట్‌నెస్‌ అంటే మనకు కనిపించే శరీరం మాత్రమే కాదంటోంది బాలీవుడ్‌ అగ్రనటి దీపిక పదుకొణె. ఇటీవల ఆమె ఒక పోషకాహార సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడింది. బయటికి కనిపించే శరీరాన్ని బట్టి ఒక వ్యక్తి ఫిట్‌నెస్‌ నిర్ధారించలేమని, మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే అసలైన ఫిట్‌నెస్‌ అని ఆమె అభిప్రాయపడింది. శరీరానికి, మనస్సుకు మధ్య ఉండే సమతుల్యతే ఫిట్‌నెస్‌కు అర్థం చెబుతుందని ఆమె పేర్కొంది.

సహనటుడు రణ్‌వీర్‌సింగ్‌తో వివాహమైన తర్వాత ఆమె మరింత జోరుపెంచి వరుస సినిమాలకు సంతకాలు చేస్తోంది. గతేడాది ఆమె నటించిన ‘ఛపాక్‌’ మంచి విజయం సాధించింది. అందులో యాసిడ్‌ బాధితురాలిగా దీపిక నటన అందర్నీ కట్టుకుంది. ప్రస్తుతం ఆమె తన భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి స్పోర్ట్స్‌ డ్రామా ‘83’లో నటిస్తోంది. ఆ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌తో కలిసి దీపిక నటించనుంది. వీళ్ల కాంబినేషన్‌లో ‘పఠాన్‌’ తెరకెక్కుతోంది. అంతేకాదు.. ప్రభాస్‌తో కలిసి ఒక పాన్‌ ఇండియన్‌ సినిమాకు కూడా ఆమె సంతకం చేసింది. ఆ సినిమా కోసం ఆమె 75 రోజుల పాటు డేట్స్‌ కూడా ఖరారు తెలుస్తోంది. జూన్‌లో ‘పఠాన్‌’ చిత్రీకరణ పూర్తికాగానే.. జులైలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌తో కలిసి నటించనున్నట్లు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని