వాన్‌ తీవ్ర విమర్శలు.. ఈ సారి పిచ్‌పై కాదు! - this pitch is perfect but england batting poorly says michael vaughan
close
Published : 05/03/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాన్‌ తీవ్ర విమర్శలు.. ఈ సారి పిచ్‌పై కాదు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాతో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ అస్సలు బాగాలేదని ఆ జట్టు మాజీ ఆటగాడు మైకేల్‌ వాన్‌ అంటున్నాడు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోందని బంతి మరీ టర్న్‌ అవ్వడం లేదని పేర్కొన్నాడు. గత సిరీసులతో పోలిస్తే జోరూట్‌ సేన బ్యాటింగ్‌ మాత్రం చెత్తగా ఉందని ఘాటుగా విమర్శించాడు. తొలిరోజు ఆట సందర్భంగా అతడు ట్వీట్‌ చేశాడు.

మొతేరా వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొంది. కానీ 205 పరుగులకే ఆలౌటైంది. అక్షర్‌ పటేల్‌ 4, అశ్విన్‌ 3, సిరాజ్‌ 2 వికెట్లతో ఆ జట్టు నడ్డి విరిచారు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నప్పటికీ కట్టుదిట్టమైన  లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు విసిరారు. దాంతో బెన్‌స్టోక్స్‌ (55), డేనియెల్‌ లారెన్స్‌ (46) మాత్రమే కొన్ని పరుగులు చేశారు. కాగా తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 24 పరుగులు చేసింది.

‘గత కొన్ని మ్యాచులతో పోల్చుకుంటే ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ మరింత పేలవంగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసేందుకు అత్యుత్తమ పిచ్‌ ఇది. బంతి స్పిన్‌ అవ్వడం లేదు. అంతేకాకుండా బ్యాటు మీదకు వస్తోంది. బ్యాటింగ్‌ అస్సలు  బాగాలేదు’ అని వాన్‌ ట్వీట్‌ చేశాడు. గత మ్యాచు సందర్భంగా మొతేరా పిచ్‌ను అతడు విమర్శించిన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని