​​​​​​పెట్రో మంట.. ఆ సర్కారు చలవ ₹1! - this state govt reduces tax by re 1 per litre on petrol diesel
close
Published : 21/02/2021 17:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​​​పెట్రో మంట.. ఆ సర్కారు చలవ ₹1!

కోల్‌కతా: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీకి చేరువవుతున్న వేళ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ప్రజలపై కాస్త కనికరం చూపింది. లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌పై చెరో రూపాయి తగ్గించింది. సవరించిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి అమిత్‌ మిత్రా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కొంతమేర ప్రజలకు ఊరట లభిస్తుందన్నారు.

పెట్రోల్‌పై కేంద్రం రూ.32.90 పన్ను విధిస్తుంటే రాష్ట్రం రూ.18.46 మాత్రమే వసూలు చేస్తోందని ఈ సందర్భంగా అమిత్‌ మిత్రా పేర్కొన్నారు. అలాగే డీజిల్‌పై కేంద్రం రూ.31.80 సంపాదిస్తుంటే రాష్ట్రం రూ.12.77 మాత్రమే పన్ను వేస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు ఆదాయం రాకుండా కేంద్రం సెస్సులు వసూలు చేస్తోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని